KTR: హస్తం పార్టీ కపట కథలు.. కంత్రీ గోత్రాలు తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ

KTR: కాంగ్రెస్‌ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం

Update: 2023-09-18 08:28 GMT

KTR: హస్తం పార్టీ కపట కథలు.. కంత్రీ గోత్రాలు తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ

KTR: కాంగ్రెస్‌ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని ట్విట్టర్‌ వేదికగా ఫైరయ్యారు.

రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ అని, కాలకేయుల కాలం వస్తే కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు గ్యారెంటీ అన్నారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతవుతుందని, ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ అని ట్వీట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Tags:    

Similar News