KTR: జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరంట కానీ.. సీఎం అవ్వాలన్న సోకు మాత్రం ఉంది
KTR: కాంగ్రెస్‌కు ఓటేస్తే అంధకారం, కరెంట్ కోతలు తప్పవు
KTR: జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరంట కానీ.. సీఎం అవ్వాలన్న సోకు మాత్రం ఉంది
KTR: మంత్రి కేటీఆర్ మరోసారి కాంగ్రెస్‌పై కన్నెర్ర జేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆర్నెళ్లకో సీఎం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ఆరుగురో, ఏడుగురో సీఎం అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డికి చురకలు అంటించారు మంత్రి కేటీఆర్. జానారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరంట కానీ.. సీఎం అవ్వాలన్న సోకు మాత్రం ఉందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని, అంధకారం, కరెంట్ కోతలు తప్పవని అన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటేసి తెలంగాణ ప్రజలు తప్పుచేయొద్దని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఎల్బీనగర్‌లో బూత్ కమిటీ మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.