KTR: అన్నదాత పాలిట నెం.1 విలన్ కాంగ్రెస్

KTR: అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను.. ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రైతులు సహించరు

Update: 2023-10-26 06:05 GMT

KTR: అన్నదాత పాలిట నెం.1 విలన్ కాంగ్రెస్

KTR: కాంగ్రెస్‌ ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌ను కలిసి రైతు బంధు నిధులు ఆపేయాలని కోరడంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ రైతు విరోధి అంటూ మరోసారి రుజువైందంటూ సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్ అటాక్‌ చేశారు. ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంట్‌ కూడా ఆపేయమంటారేమో అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ అన్నదాత పాలిట నెం.1 విలన్ అన్నారు. అన్నదాతల పొట్టకొట్టే కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ రైతులు సహించరని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసి అరిగోస పడుతున్నారన్న కేటీఆర్.. రైతు బంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు.


Tags:    

Similar News