KTR: సీఎం రేవంత్‌రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు.. నా అరెస్ట్ జరగదు
KTR: చిట్‌చాట్‌లో మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని, తన అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చేయరు.. నా అరెస్ట్ జరగదు
KTR: చిట్‌చాట్‌లో మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని, తన అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏమీలేదని రేవంత్‌కు కూడా తెలుసన్న కేటీఆర్.. ఏ తప్పూ చేయలేదని, లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమేనని అన్నారు. కడియం శ్రీహరిని కాపాడేందుకు.. దానంతో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తుపై దానం పోటీచేసి దొరికిపోయారని, అనర్హత వేటు పడితే ఇజ్జత్ పోతుందని.. దానంతో రాజీనామా చేయిస్తున్నారని అన్నారు. సాంకేతిక సాకులు చూపించి.. కడియంను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్.. ఆ తర్వాత ఉపఎన్నికలు వస్తాయని చెప్పారు.