KTR: కవిత సస్పెన్షన్‌పై స్పందించిన కేటీఆర్
KTR on Kavitha Suspension: తన సోదరి కవిత విషయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ తొలిసారి స్పందించారు.
KTR: కవిత సస్పెన్షన్‌పై స్పందించిన కేటీఆర్
KTR on Kavitha Suspension: తన సోదరి కవిత విషయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ తొలిసారి స్పందించారు. కవితపై పార్టీలో నిర్ణయించి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఒక్కసారి చర్యలు తీసుకున్నాక తాను మాట్లాడేది ఏమి లేదని స్పష్టం చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌పై కవిత ఆరోపణలు చేసి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌కు గురయ్యారు. ఆమె ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ నుంచి అక్రమంగా సస్పెండ్ అయ్యానని ఆమె ఆరోపించారు. ఎప్పుడూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని, అయినప్పటికీ తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “నాపై కుట్రలు జరుగుతున్నాయంటూ చెప్పినప్పటికీ, కనీసం ఒక ఫోన్ చేసి అడగాల్సిన బాధ్యత కేటీఆర్ తీసుకోలేదు. 103 రోజులుగా ఆయన నాతో మాట్లాడలేదు” అని కవిత వ్యాఖ్యానించారు.
అయితే, తనకు నోటీసు ఇచ్చిన విషయంపై పెద్దగా బాధలేదని అన్నారు. “ఇంతవరకు లేనట్టుగా తెలంగాణ భవన్‌లో మహిళా నేతలు ఈ వ్యవహారంపై స్పందించడమే నాకు కొంత ఊరట కలిగించింది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.