Jukkal: లంబాడీల తండాల్లో గోకులాష్టమి వేడుకలు

Jukkal: ఏకరూప దుస్తులతో పవిత్ర మట్టి తెచ్చిన మహిళలు

Update: 2023-09-07 02:49 GMT

Jukkal: లంబాడీల తండాల్లో గోకులాష్టమి వేడుకలు

Jukkal: జుక్కల్ నియోజకవర్గంలో శ్రీకృష్ణజన్మాష్టమివేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రాలు, గ్రామాలతోపాటు, పెద్ద కొడప్‌గల్ మండలంలో అధికంగా ఉన్న లంబాడీల తండాల్లో గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సముందర్ తండాలో కాయితు లంబాడీలు శ్రీకృష్ణ జన్మాష్టమివేడుకలను భక్తి శ్రద్ధలతో జరిపారు. మహిళలంతా ఏకరూప దుస్తులతో చేలల్లోకెళ్లి పవిత్ర మట్టిని తెచ్చి... శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రూపొందించి పూజించారు.

లబనా సమాజ్ ఆధ్వర్యంలో అర్థరాత్రి ఆకాశంలో చంద్ర దర్శనాననంతరం పవిత్ర స్నానాలు ఆచరించి, పొలాల్లోంచి మట్టితెచ్చి శ్రీకృష్ణ ప్రతిమను రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిర్మన్ బంక, నెయ్యితో గోధుమ రొట్టెలతను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించారు. శ్రీకృష్ణ వైభవాన్ని కీర్తిస్తూ భజనలతో తన్మయులయ్యారు. ఇక్కడ మూడు రోజులపాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Tags:    

Similar News