Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Koppula Eshwar: ఇప్పుడు పిటిషన్ కొట్టివేయడం సాధ్యం కాదన్న హైకోర్టు
Koppula Eshwar: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
Koppula Eshwar: ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ వేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు. తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కొప్పుల ఈశ్వర్ హైకోర్టును కోరారు. అయితే మూడేళ్ల పాటు విచారణ జరిగి.. అడ్వకేట్ కమిషన్ దగ్గర వాదనలు ముగిశాక ఇప్పుడు పిటిషన్ కొట్టివేయడం సాధ్యం కాదంది హైకోర్టు. తుది వాదనలు వినాల్సి ఉందని తెలిపింది.
కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్ వేశారు. 2018లో ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లక్ష్మణ్ పిటిషన్ వేశారు. దాంతో రీకౌంటింగ్‌కు గతంలో హైకోర్టు ఆదేశించగా.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేవని అధికారులు తెలిపారు. దీంతో అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. విచారణ జరుగుతున్నందున పిటిషన్ కొట్టివేయలేమని తెలిపింది.