కొండగట్టు దుర్ఘటనకు ఏడాది!

అది మామూలు ప్రమాదం కాదు. అక్కడిక్కడే 57 మంది చనిపోయారు. మరో 8 మంది ఆసుపత్రిలో మరణించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు దగ్గర సరిగ్గా ఏడాది క్రితం ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2019-09-11 08:31 GMT

దైవదర్శనానికి వెళ్లిన వారికి అదే చివరి రోజయ్యింది. కొండా గట్టు ఆంజనేయుని సేవించాలని వెళ్లిన వారిని కొండా మలుపు కాటేసింది. జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద బస్సు ప్రమాదం జరిగి ఈ రోజు (సెప్టెంబర్ 11) కు సరిగ్గా ఏడాది పూర్తయింది. కొండగట్టు ఆంజనేయుని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన వారు ఎక్కిన ఆర్టీసీ బస్సు కొండ దిగుతూ మలుపులో ఓవర్ లోడ్ కారణంగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో 57 మంది ప్రయాణీకులు అక్కడి కక్కడే మరణించారు. ఇక మరో 8 మంది ఆసుపత్రి లో చికిత్సపొందుతూ మరణించారు. 

రాష్ట్ర ప్రజలనే కాకుండా యావత్ దేశ ప్రజలని ఈ వార్త కుదిపేసింది. ఇక ఏడాది పూర్తయినా ఆ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలు ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ సంఘటనలో తీవ్ర గాయాల పాలైన వారు ఇప్పటికీ మామూలు గా మారలేకపోయారు. వారి కుటుంబ సభ్యులు తమ ఉద్యోగాలు వదులుకుని వారి సేవల్లోనే కాలం గడపాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ కొండగట్టు ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఏడాది గడుస్తున్నా బాధిత కుటుంబాలకు స్వాంతన చేకోరూరక పోవడం శోచనీయం. 




Tags:    

Similar News