Konda Surekha: రాముడి ఓట్లు దండుకునేందుకు మోడీ ప్రయత్నం
Konda Surekha: గతంలో రఘునందన్‌రావు కేంద్రం నుంచి.. ఎన్ని నిధులు తెచ్చారో చూపించాలి
Konda Surekha: రాముడి ఓట్లు దండుకునేందుకు మోడీ ప్రయత్నం
Konda Surekha: కుటుంబ పాలనతో తెలంగాణను లూలీ చేసి డబ్బు సంపాదించి జైలులో ఉన్న బిడ్డను విడుదల చేసుకునేందుకు కేసీఆర్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు మంత్రి కొండా సురేఖ. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆమె ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్‌రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చూపించాలని సవాల్ చేశారు. రాముడి పేరుతో ఓట్లు దండుకునేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏదేమైనా మెదక్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటూ ఆమె దీమా వ్యక్తం చేశారు.