Komatireddy: అక్టోబర్ 1న స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. అదే రోజు అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతుంది
Komatireddy: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది
Komatireddy: అక్టోబర్ 1న స్క్రీనింగ్ కమిటీ సమావేశం.. అదే రోజు అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అవుతుంది
Komatireddy: అక్టోబర్ 1న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అదే రోజు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతపై ఆరు గ్యారంటీ స్కీమ్స్ ప్రకటనతో వందకు వందశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని దీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో గెలిచినప్పుడు కూడా ఇలాంటి వేవ్ లేదన్నారు. తుక్కుగూడలో సోనియాగాంధీ సభ తర్వాత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డెడ్‌లైన్ విధించలేదన్నారు.