Komatireddy: మునుగోడుకు రూ.2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామాకు సిద్ధం
* బై ఎలక్షన్ వస్తేనే అభివృద్ధి చేస్తారా అంటూ ఎమ్మెల్యే ప్రశ్న
కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)
Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అభివృద్ధి కోసం 2వేల కోట్లు ఇస్తానంటే రాజీనామా చేస్తానని రాజ్‌గోపాల్‌రెడ్డి సవాల్ చేశారు. బైఎలక్షన్ వస్తేనే అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలా అయితే తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు అవుతుందా అని అన్నారు. ఎంతసేపు రాజకీయలబ్ధి తప్పా ప్రజాపాలనపై దృష్టిసారించడం లేదని ఆయన ఎద్దెవా చేశారు.