అన్నదో దారి... తమ్ముడిది మరో దారి

Komati Reddy Brothers: కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే సెపరేట్

Update: 2022-04-25 07:06 GMT

Komatireddy Brothers Route Separate

Komati Reddy Brothers: ఆ బ్రదర్స్ ను చూసి తెలంగాణలో... మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మాట బలంగా విన్పిస్తోంది. బ్రదర్స్ అంటే ఇలా ఉండాలి రా.. బ్రదర్స్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ రా అని అనుకునే అంతగా వాళ్లిద్దరూ పాపులర్. కానీ రోజులు గడిచే కొద్దీ సీన్ చేంజ్ అయిపోయింది. మొన్నటి వరకు పాలు-నీళ్లలా ఉన్న నేతలు ఇప్పుడు ఉప్పు-నిప్పులా మారిపోయారు. బ్రదర్స్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ... అన్నదో దారి... తమ్ముడిది మరో దారి అన్నట్టుగా సిచ్యువేషన్ మారిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రూటే సెపరేట్ అన్నట్టుగా సీన్ చేంజ్ అవుతోంది.

మొదట్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బ్రదర్స్ ఇద్దరూ వ్యతిరేకించారు... ఐతే కొద్ది రోజుల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావడంతో వెంకట్ రెడ్డి.. రేవంత్ బాటలో ముందుకు సాగుతున్నారు. తాజాగా వెంకట్ రెడ్డికి, ఏఐసీసీ... టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇవ్వడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఐతే ఇదే సమయంలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అన్నతో దూరంగా ఉంటున్నాడు. మునుగోడు ఎమ్మెల్యేగా ‌ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... అన్న వెంకట్ రెడ్డితో కుటుంబపరంగా సన్నిహితంగానే ఉంటున్నా... రాజకీయంగా మాత్రం విభేదిస్తున్నాడు.

జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే గా ఉన్న రాజగోపాల్ రెడ్డి మొదట్నుంచి సంథింగ్ స్పెషల్ గా ఉండాలనుకుంటాడు. అందుకే నిర్ణయాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయ్. కానీ అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం పార్టీలో సమస్యలున్నా.. కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని కొనసాగుతున్నాడు. కానీ బ్రదర్స్ ఇద్దరూ మునుగోడు నియోజకవర్గంలోనూ ఎవరిదారి వారి అన్నట్టుగా సాగుతున్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోనే మునుగోడు నియోజకవర్గం ఉన్నా... ఇద్దరి మధ్య మాత్రం గ్యాప్ అలాగే కొనసాగుతోంది. మే 6న రాహుల్ గాంధీ సభకు సన్నాహక సమావేశం విషయంలోనూ ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టు కన్పిస్తోంది. రేవంత్ సన్నాహక సమావేశం నల్గొండలోనా, సూర్యాపేటలోనా లేదంటే యాదాద్రి జిల్లాలోనా అన్నదానిపై బ్రదర్స్ మధ్య అంగీకారం కుదరడం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News