Komatireddy Raj Gopal Reddy: సీఎంను ఉద్దేశిస్తూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Komatireddy Raj Gopal Reddy: సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Raj Gopal Reddy: సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నిధులు సమకూర్చాలన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచనలను సమర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదేనంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న రాజగోపాల్... ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించి వ్యవహరించాలని సూచించారు.