Asifabad: వాగుదాటలేక రాత్రంతా బడిలోనే ఉన్న టీచర్లు
Asifabad: ఉదయం స్కూల్ వెళ్లిన ఉపాధ్యాయులు.. రాత్రింతా స్కూళ్లో గడపాల్సి వచ్చింది.
Asifabad: ఉదయం స్కూల్ వెళ్లిన ఉపాధ్యాయులు.. రాత్రింతా స్కూళ్లో గడపాల్సి వచ్చింది. తిరిగి వెళ్లే సమయంలో ఊరు చివర వాగు ఉధృతంగా ఉప్పొంగడంతో వాగు దాటే పరిస్థితి లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ.. ఇద్దరు మహిళా టీచర్లు సహా నలుగురు ఉపాధ్యాయులు స్కూల్లోనే బస చేయాల్సి వచ్చింది.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చెల్కగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉపాధ్యాయులు స్కూల్లో చిక్కుకున్నారు. స్వాతి, సుమలత, హరిప్రకాష్, జాలింషాలు స్కూల్ ముగిసిన తర్వాత ఆసిఫాబాద్‌కు ప్రయాణమయ్యారు. దారిలో వాగు ఉప్పొంగడంతో గంటల తరబడి నిరీక్షించారు. అంతకంతకు ఉధృతి పెరగడంతో... చేసేదిమీ లేక చెల్కగూడలోని ప్రాథమిక పాఠశాలలోనే రాత్రింతా గడిపారు. చెల్కగూడలో మొబైల్ సిగ్నల్ అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.