Etela Rajender: ఈటలతో ముగిసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండరాం భేటీ
Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండరాం, ఏనుగు రవీందర్‌రెడ్డి భేటీ ముగిసింది.
Etela Rajender: ఈటలతో ముగిసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండరాం భేటీ
Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోదండరాం, ఏనుగు రవీందర్‌రెడ్డి భేటీ ముగిసింది. ఈటల కుటుంబంపై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఈటల నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. కోవిడ్ విపత్కర సమయంలో రాజకీయాలు కరెక్ట్ కాదని అన్నారు విశ్వేశ్వర్‌రెడ్డి. ఇక ఈటలపై దాడిని ఆత్మగౌరవ దాడిగా పరిగణిస్తున్నామని చెప్పారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. ఈటల విషయంలో ఐక్యవేదిక ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్న ఆయన ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని స్పష్టం చేశారు.