Hyderabad: సమ్మర్ ల్యాండ్ జ్యూస్ సెంటర్ వద్ద కత్తులతో హల్‌చల్..
Hyderabad: జ్యూస్ సెంటర్ అద్దాలను ధ్వంసం చేసి పరారీ
Hyderabad: సమ్మర్ ల్యాండ్ జ్యూస్ సెంటర్ వద్ద కత్తులతో హల్‌చల్..
Hyderabad: హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. సమ్మర్ ల్యాండ్ జ్యూస్ సెంటర్ వద్ద కొందరు గుర్తుతెలియని వ్యక్తులు.. కత్తులతో హల్‌చల్ చేశారు. జ్యూస్ సెంటర్ యజమానిపై దాడికి యత్నించారు. జ్యూస్ సెంటర్ అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆకతాయిలను గుర్తించే పనిలో పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.