Kishan Reddy: కాంగ్రెస్‌కు దోచుకోవడం ఒక్కటే తెలుసు
Kishan Reddy: ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
Kishan Reddy: కాంగ్రెస్‌కు దోచుకోవడం ఒక్కటే తెలుసు
Kishan Reddy: ఎక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. బడ్జెట్ కేటాయింపుల్లేకుండా రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తోన్న కాంగ్రెస్.. ఇప్పుడు యూనివర్సిటీల భూములను కాజేయడానికి సిద్ధమైందని ఆరోపించారు. మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నించగా.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిందని ఆయన అన్నారు.
ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యనివర్సిటీలో భూములపై కన్నేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. యూనివర్సిటీ భూములను ఆర్థిక దోపిడీకి వాడుకోవడంపైనే రేవంత్ సర్కార్ ఆసక్తి చూపిస్తోందని ఆరోపించారు కిషన్‌రెడ్డి.