Kishan Reddy: త్వరలో లిస్ట్.. 17 సీట్లలో పోటీ చేసి...మెజార్టీ సీట్లు గెలుస్తాం

Kishan Reddy: త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తాం

Update: 2024-02-09 15:00 GMT

Kishan Reddy: త్వరలో లిస్ట్.. 17 సీట్లలో పోటీ చేసి...మెజార్టీ సీట్లు గెలుస్తాం 

Kishan Reddy: త్వరలోనే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 17 సీట్లలో పోటీ చేసి...మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. గ్రామస్థాయిలో చేరికల పై దృష్టి పెట్టామని తెలిపారు. కిషన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బిజెపి ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆశావాహుల జాబితాపై నేతలు చర్చించారు. ఒక్కో స్థానం నుంచి మూడు నాలుగు పేర్లను కేంద్ర పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిటీ పంపనుంది.

Tags:    

Similar News