గవర్నర్‌ వ్యాఖ్యలతో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు : కిషన్ రెడ్డి

Kishan Reddy responding to the governor comments : తెలంగాణలో కరోనా వైరస్ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2020-08-23 11:46 GMT

 కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

Kishan Reddy responding to the governor comments : తెలంగాణలో కరోనా వైరస్ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కరోనా వైరస్ టెస్టుల విషయంలో వెనకబడి ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే 2 లక్షల పీపీఈ కిట్లు.. 1,400 వెంటిలేటర్లను, 14 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు అందించామని అన్నారు.

లాక్ డౌన్ సమయంలో మూడు సార్లు కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించాయని గుర్తు చేశారు. కరోనా వైరస్‌ ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని, కరోనా విషయంలో 130 కోట్ల మంది ప్రజలను మోదీ ఏకం చేశారని అన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు 28 రోజుల తర్వాత ప్లాస్మా ఇవ్వవచ్చని అన్నారు. ప్రజలలో ప్లాస్మా దానంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఢిల్లీలో 20 వేల పడకలు ఖాళీగా ఉన్నాయని కేసులు తగ్గాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.

ఇక తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలు కావని కిషన్ రెడ్డి అన్నారు. గవర్నర్‌ వ్యాఖ్యలతో బీజేపీకి గానీ, కేంద్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ఆమె వ్యక్తిగతంగా వైద్యురాలు కాబట్టి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారని తెలిపారు.

Tags:    

Similar News