Kishan Reddy: దివ్యాంగుల రిజర్వేషన్ ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే..
Kishan Reddy: సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
Kishan Reddy: దివ్యాంగుల రిజర్వేషన్ ను 4శాతానికి పెంచిన ఘనత మోడీదే..
Kishan Reddy: సికింద్రాబాద్ అడ్డగుట్టలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అంతకుముందు దివ్యాంగులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పని చేసిన ప్రభుత్వం మోడీ ప్రభుత్వమని అన్నారు. అంగవైకల్యంతో ఉన్నవారిని దివ్యాంగులని సంబోధించాలని చెప్పడమే కాకుండా.. అలానే పిలవాలని ప్రధాని మోడీ జీవో తీసుకువచ్చారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. దివ్యాంగులకు 3శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4శాతానికి పెంచిన ఘనత కూడా మోడీకే దక్కుతుందన్నారు. దివ్యాంగులకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కిషన్‌రెడ్డి.