Kishan Reddy: కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓట్ల కన్నా.. ఎక్కువ శాతం మాకే

Kishan Reddy: డబ్బు, మద్యం పంపకాలను ఎదుర్కొని కార్యకర్తలు పనిచేశారు

Update: 2023-12-04 10:40 GMT

Kishan Reddy: కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓట్ల కన్నా.. ఎక్కువ శాతం మాకే

Kishan Reddy: గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓట్ల కన్నా.. ఎక్కువ శాతం ఓట్లు మా పార్టీ పొందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఫలితాలను సమీక్షించుకుని మంచి పలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలు నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాన్నారాయన.. BRS, కాంగ్రెస్ పార్టీల డబ్బు, మద్యం పంపకాలను ఎదుర్కొని కార్యకర్తలు పార్టీ కోసం పని చేశారని అన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించిందని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అలాంటి పలితాలు రాలేదన్నారు.. ఒక సిట్టింగ్ సీఎంను, కాబోయే సీఎం అంటున్న ఇద్దరినీ ఓడించిన ఘనత బీజేపీదేనన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అభినందనలు తెలిపారు... రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలువబోతున్నారని జోస్యం చెప్పారు... కేంద్రంలో హ్యాట్రిక్ ప్రధానిక మోడీ కాబోతున్నారని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకే మద్దతు ఉంటామని ప్రజలు చెప్పారని అన్నారు. 

Tags:    

Similar News