Kishan Reddy: తెలంగాణ కోసం పోరాడింది యువతే

Kishan Reddy: చదువులు మానేసి గజ్జె కట్టి తెలంగాణ కోసం యువత పోరాటం చేసింది

Update: 2023-09-13 08:20 GMT

Kishan Reddy: తెలంగాణ కోసం పోరాడింది యువతే

Kishan Reddy: తెలంగాణ కోసం పోరాడింది యువతేనని, కానీ.. యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. చదువులు మానేసి, గజ్జె కట్టి తెలంగాణ కోసం యువత పోరాటం చేసిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం 12 వందల మంది బలిదానం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని యువత భావించారని.. కానీ, కేసీఆర్‌ సర్కార్‌.. నిరుద్యోగుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

తెలంగాణ నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్‌కు.. ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు కిషన్‌రెడ్డి.

Tags:    

Similar News