Kishan Reddy: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ
Kishan Reddy: ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలి
Kishan Reddy: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ
Kishan Reddy: హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అని... రాత్రికి రాత్రి రోడ్డుమీద పడేస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలు ఏమైపోవాలని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఇచ్చిన అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా చెబుతుందన్నారు కిషన్ రెడ్డి. అధికారులు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష వేస్తారా అని నిలదీశారు. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలన్న కిషన్ రెడ్డి.. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలన్నారు.