Telangana: పవన్‌తో గ్యాప్ తగ్గించుకునేందకు బీజేపీ ప్లాన్
Telangana: బీజేపీతో జనసేనానికి ఉన్న గ్యాప్‌ను సరిచేసేందుకు త్వరలోనే కమలనాథులు రంగంలోకి దిగనున్నారు.
Telangana: పవన్‌తో గ్యాప్ తగ్గించుకునేందకు బీజేపీ ప్లాన్
Telangana: బీజేపీతో జనసేనానికి ఉన్న గ్యాప్‌ను సరిచేసేందుకు త్వరలోనే కమలనాథులు రంగంలోకి దిగనున్నారు. జనసేన అధినేత పవన్‌తో బీజేపీ సీనియర్ నేతలు కిషన్‌రెడ్డి, లక్షణ్ సమావేశం కాబోతున్నారు. కొంతకాలంగా తెలంగాణ బీజేపీపై పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి పవన్ మద్దతివ్వడం సంచలనం రేపింది. పవన్ ప్రకటన ఎమ్మెల్సీ ఫలితాలపై పడిందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే పవన్‌ను నేరుగా కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ భేటీలో నాగార్జునసాగర్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతుఇవ్వాల్సిందిగా కోరే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ రాగానే లక్ష్మణ్‌తో కలిసి పవన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది.