Kishan Reddy: కాంగ్రెస్ అధ్యక్షుడిగా విఫలమైన వ్యక్తి రాహుల్

Kishan Reddy: బీఆర్ఎస్-కాంగ్రెస్ లోపాయికార ఒప్పందం చేసుకుని.. బీజేపీపై కుట్రలు చేస్తున్నారు

Update: 2023-07-03 11:05 GMT

Kishan Reddy: కాంగ్రెస్ అధ్యక్షుడిగా విఫలమైన వ్యక్తి రాహుల్

Kishan Reddy: కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనని, ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎవరు ఎవరికి బీ టీమో అందరికీ తెలుసని అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇటీవల విపక్ష నేతలతోనూ అఖిలేశ్‌ భేటీ అయ్యారు. వీరిద్దరి తాజా భేటీ చూస్తే ఎవరు ఎవరికి బీ టీమో తెలుస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ గతంలో పొత్తులు పెట్టుకున్నాయని చెప్పిన కిషన్‌ రెడ్డి.. బీజేపీ మాత్రం బీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన వ్యక్తి రాహుల్‌గాంధీ అని ఎద్దేవా చేశారు. బీజేపీని విమర్శించే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. బీజేపీకి కాంగ్రెస్‌ ఎంత దూరమో..బీఆర్ఎస్‌కు కూడా అంతే దూరమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News