Kishan Reddy: రామ మందిరం ఎన్నికల కోసం వచ్చింది కాదు
Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఆదివాసీ, గిరిజనులు, దళితులకు అవకాశాలు
Kishan Reddy: రామ మందిరం ఎన్నికల కోసం వచ్చింది కాదు
Kishan Reddy: అయోధ్య రామ మందిరం ఎన్నికల కోసం వచ్చిoది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మందిరం కోసం ఎంతో మంది అమరులు అయ్యారని, వారి త్యాగ ఫలితమే ఇప్పటి రామ మందిర నిర్మాణం అన్నారు ఆయన. అయోధ్య రామ మందిరం కోసం బీజేపీ పోరాటం చేసిందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు.. కుహనా లౌకిక వాదులు అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆదివాసీ, గిరిజనులు, దళితులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చాక ఎందరో మహనీయులను గుర్తించి వారి చరిత్రను భవిష్యత్ తరాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు.