Kishan Reddy: సింగరేణి గనులు ప్రైవేటీకరణపై కేంద్రానికి ఆసక్తి లేదు
Kishan Reddy: సింగరేణి గనులను మైనింగ్ కాంట్రాక్టును ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిందెవరు?
Kishan Reddy: సింగరేణి గనుల ప్రైవేటీకరణపై కేంద్రానికి ఆసక్తి లేదు
Kishan Reddy: సింగరేణి గనులను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్వయంగా ప్రధానమంత్రే చెప్పారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సింగరేణి గనులను ప్రైవేటు పరం చేసే అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబం సింగరేణి కార్మికులకు అబద్ధాలు చెప్పి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి గనులకు నష్టం తెచ్చిపెట్టింది కల్వకుంట్లకుటుంబమేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి గనుల మైనింగ్ కాంట్రాక్టు ప్రైవేటు వ్యక్తులకు ఇప్పించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. సింగరేణి గనుల భూముల్ని ఇష్టారాజ్యంగా కబ్జా చేసి, దర్జాగా అమ్మి కోట్లు గడించిందెవరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.