తెలంగాణ భవన్‌లో ఖమ్మం లోక్‌సభ సమీక్ష సమావేశం

Khammam: హాజరైన కేటీఆర్‌, ఎంపీలు నామా, వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యేలు

Update: 2024-01-09 08:12 GMT

తెలంగాణ భవన్‌లో ఖమ్మం లోక్‌సభ సమీక్ష సమావేశం

Khammam: తెలంగాణ భవన్‌లో ఖమ్మం లోక్‌సభ సమీక్ష సమావేశం జరుగుతోంది. ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, మధిర, వైరా, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌, ఎంపీలు నామా, వద్దిరాజు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2019లో ఖమ్మం పార్లమెంట్‌లో నామా నాగేశ్వర్‌రావు విజయం సాధించారు. ఈసారి ఎవరు పోటీ చేస్తారనేదానిపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్‌ స్థానం దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అంతర్గత విభేదాలతో బీఆర్‌ఎస్ సతమతమవుతుంది. కాంగ్రెస్‌ అభ్యర్థికి ధీటైన అభ్యర్థిని పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది.

Tags:    

Similar News