Siva Balakrishna: శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు
Siva Balakrishna: HMDAలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు గుర్తింపు
Siva Balakrishna: శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు
Siva Balakrishna: శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. HMDAలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు సమాచారం చేరవేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారులు వ్యవహించారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. గతంలో వేలంపాట జరిగిన సమయంలో HMDAలో బాలకృష్ణ పనిచేసినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో HMDAలోని అధికారుల పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది.