Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇండియాకు రానున్న ప్రభాకర్ రావు
Telangana Phone Tapping Case
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ఈనెల 5న సెట్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. ఆయన 14నెలలుగా అమెరికాలో ఉంటున్నారు. ఇటీవల భారత్ కు తిరిగిరావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తిరిగి రానున్నారు. విచారణకు హాజరవుతానని సెట్ కు ప్రభాకర్ రావు తెలిపినట్లు సమాచారం.
మరోవైపు విచారణకు సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లేఖ ఇచ్చారు. వన్ టైం ఎంట్రీ పాస్ పోర్టు అందిన వెంటనే భారత్ కు రానున్నారు ప్రభాకర్ రావు. పాస్ పోర్టు అందిన మూడు రోజుల్లో రావాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ప్రభాకర్ రావును ఆదేశించింది. ప్రభాకర్ రావును విచారిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బ్రుందం భావిస్తోంది.