మంత్రి కేటీఆర్ కి థాంక్స్ చెప్పిన ఏపీ ఎంపీ

కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్రం ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2020-03-27 12:22 GMT
KTR

కరోనా వైరస్ ప్రభావం వలన కేంద్రం ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.. కరోనా వైరస్ ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు కీలకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇక ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయి. దీనితో వాహనాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.. దీనితో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఎం చేయలేక రోడ్లపైనే కష్టాలు పడుతున్నారు.. తినడానికి తిండి లేక ఇబ్బందుల్లో ఉన్నారు. కొన్ని లారీల్లో సరుకు ఉండటంతో అక్కడే కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీరి కష్టాలను గుర్తించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ని కోరారు..

"విజయవాడ పార్లమెంట్ కు చెందిన కొందరు లారీ డ్రైవర్లు CCI గోడౌన్స్,మనోరబాద్(గ్రా) తూప్రాన్(మం)మెదక్ జిల్లా తెలంగాణ నందు చిక్కుకుని నీరు,ఆహారం లేకుండా అలమటిస్తున్నారు. కావున వెంటనే ఆహారం,వసతి సదుపాయాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను" అని ఎంపీ కేశినేని నాని కోరారు. దీనిపైన వెంటనే అప్రమత్తం ఆయన మంత్రి కేటీఆర్ స్పందించారు.. లారీ డ్రైవర్ల గురించి తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌ను వెంటనే అప్రమత్తం చేశారు. సమస్యపై కేటీఆర్ వెంటనే స్పందించి, పరిష్కరిస్తామని హమీ ఇవ్వడంతో మంత్రి కేటీఆర్ కి కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News