KCR: మూడో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌.. కేంద్రమంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్

*ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ వెయిటింగ్ *పలు అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించనున్న కేసీఆర్

Update: 2021-11-23 05:24 GMT

మూడో రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌(ఫైల్ ఫోటో) 

KCR: మూడు రోజు ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఇక ఈ సందర్భంగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు.

ధాన్యం సేకరణ సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీశాఖ సెక్రటరీ సుధాన్ష్ పాండేను సీఎస్ సోమేష్ కుమార్ కలిశారు. ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో రాష్ట్ర మంత్రులు సమావేశంకానున్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి పీయూష్ గోయల్‌తో చర్చించనున్నారు.

గతేడాది రబీలో పెండింగ్‌లో ఉన్న 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ప్రస్తుత ఖరీఫ్ పంటలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, వచ్చే రబీ పంటలో వరి వేస్తే కొనుగోలు చేస్తారా అనే అంశాల పై మంత్రులు స్పష్టత కోరనున్నారు.

Full View


Tags:    

Similar News