ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.. జిల్లాల వారీగా పంటల మ్యాప్‌..

Update: 2020-05-21 07:32 GMT

హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు విధానంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లాల వారీగా సాగు చేయాల్సిన పంటలపై అధికారులంతా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏయే జిల్లాలలో ఏయే పంటలు వేయాలి, ఎంత మొత్తంలో వేయాలి అనే అంశంపై చర్చిస్తారు. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ, ఎంత వేయాలి? అనే అంశాలను ఖరారు చేయనున్నారు. అధికారులందరూ జిల్లాల వారీగా పంటల మ్యాప్‌ను రూపొందించనున్నారు.

సమావేశంలో ఈ పంటల మ్యాప్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రగతి భవన్ లో సీఎం నిర్వహించే సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు హాజరు కానున్నారు. పసుపు 1.20 లక్షల ఎకరాల్లో, మిర్చి 2 లక్షల ఎకరాల్లో, వరి 40 లక్షల ఎకరాల్లో, 70 లక్షల ఎకరాల్లో పత్తి, కంది 15 లక్షల ఎకరాల్లో, కూరగాయలు 2 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 3 లక్షల ఎకరాల్లో వేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. మక్క పంటను యాసంగిలో మాత్రమే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News