KCR: మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలి.. అక్రమాలకు పాల్పడేవారికి టిక్కెట్ కష్టమే
KCR: దళిత బంధు పథకం అమల్లో ఎమ్మెల్యేల వ్యవహారశైలి విచారకరం
KCR: మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలి.. అక్రమాలకు పాల్పడేవారికి టిక్కెట్ కష్టమే
KCR: ప్రజాప్రతినిధుల పనితీరుతో పార్టీకి మచ్చతెచ్చేప్రయత్నాన్ని సహించేది లేదని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు గట్టివార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల అమల్లో కమీషన్ల వసూళ్లు, భూ కబ్జాలు, భూ దందాలు పార్టీపైనా.. ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యేలపై ఓ దశలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పార్టీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తాయని... వాటిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి సిద్ధం కావాలన్నారు.
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. TRS, BRS గా మారిన తర్వాత జరిగిన మొట్ట మొదటి సారిగా జరిగిన ఆవిర్భావ వేడుకుల్లో ఫుల్ జోష్ కనిపించింది. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నేతలు నమ్మకం వ్యక్తం చేసారు. జాతీయ రాజకీయాలపై పలు తీర్మాణాలను ప్రతినిధుల సభ ఆమోదించింది. ప్రతిఏకరాకు సాగు నీరు, ప్రతి ఇంటికి తాగు నీరు, ఉచిత విద్యుత్, దేశంలోదళిత బంధు, బీసీ జనగణన చేపట్టాలని, విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలనే తీర్మాణాలకు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇతర రాష్ట్రాల్లో వస్తున్న ఆదరణను ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు.