DK Aruna: కవిత లేఖ వెనుక రాజకీయం.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

DK Aruna: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లు ప్రచారంలో ఉన్న ఓ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2025-05-23 08:30 GMT

DK Aruna: కవిత లేఖ వెనుక రాజకీయం.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

DK Aruna: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లు ప్రచారంలో ఉన్న ఓ లేఖ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు.

ఈ లేఖను నిజంగా కవితే రాసిందా? లేక ఆమె పేరుతో మరెవరో విడుదల చేశారా? అనే అనుమానాలు ఉందని డీకే అరుణ అన్నారు. తండ్రికి కూతురు లేఖ రాసే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇది కేవలం కుటుంబ భావోద్వేగాల ప్రయోగం కాదని, దాని వెనుక భారీ రాజకీయ వ్యూహం దాగి ఉందని ఆరోపించారు.

ఈ లేఖ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని డీకే అరుణ చెప్పారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌కు మద్దతు తెలపడం, ఇదే దిశగా కుట్రలు పన్నడం జరుగుతోందని ఆమె విమర్శించారు. కవిత లేఖను బీజేపీపై దాడికి ఉపయోగించి, ప్రజల్లో సానుభూతి రాబట్టాలనే ప్రయత్నమంటూ తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలు ప్రస్తుతం బీజేపీ వైపే చూస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా ప్రజాదరణ కోల్పోయాయని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని ఎన్నికలు జరిగినా బీజేపీ గెలవడం ఖాయమని, ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కవితకు గతంలో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ నేపధ్యంలోనే ఈ లేఖ వ్యవహారం తలెత్తిందన్న అనుమానాలున్నాయని డీకే అరుణ గుర్తు చేశారు. తండ్రికి రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో స్పష్టత ఇవ్వాలని, బీజేపీపై విమర్శలు చేయడం ద్వారా ప్రజలను మోసం చేయాలనే కుట్రలు ఫలించవని హెచ్చరించారు.

Tags:    

Similar News