Kavitha: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.. టీ న్యూస్‌తో పాటు ఎమ్మెల్యేలకు కవిత లీగల్ నోటీసులు

Kavitha: తెలంగాణ రాష్ట్రా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీ న్యూస్ చానల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసింది.

Update: 2025-12-12 07:30 GMT

Kavitha: తెలంగాణ రాష్ట్రా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత టీ న్యూస్ చానల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేసింది. తనపై, తన భర్త అనీల్ పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నేతల అవినీతిపై తానింకా చిట్టా విప్పలేదని.. ఇప్పుడు కేవలం టాస్ మాత్రమే వేశానని.. ఇంత దానికే ఉలిక్కి పడితే ఎలా అన్నారు. త్వరలోనే అవినీతి, అక్రమాలపై టెస్ట్ మ్యాచ్ ఉండబోతుందని హెచ్చరించారు. తనకు ఓ రోజు వస్తుందని.. తాను సీఎం అవుతానని అప్పుడు అందరి అక్రమాలపై విచారణ జరిపిస్తానన్నారు. జనంబాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి, అక్రమాలు అన్నీ బయటకు వస్తున్నాయన్నారు.

Tags:    

Similar News