MLC Kavitha: కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఆగస్టు 5కి వాయిదా
MLC Kavitha: విచారణలో ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు
MLC Kavitha: కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఆగస్టు 5కి వాయిదా
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 5కి వాయిదా వేసింది. విచారణలో భాగంగా కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జులై 26న కవితను వర్చువల్‌గా కోర్టులో హాజరుపర్చాలని సీబీఐని ఆదేశించింది. అలాగే, ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరఫు లాయర్లకు ఇవ్వాలని సూచించింది. కవిత సహా మరో నలుగురి పాత్రపై జూన్ 7న సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.