నేడు తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

DK Shivakumar: తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్‌ చేసేందుకు.. డీకే శివకుమార్‌ను నియమించిన అధిష్టానం

Update: 2023-12-02 04:48 GMT

నేడు తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

DK Shivakumar: నేడు తెలంగాణకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల మానిటరింగ్‌ చేసేందుకు డీకే శివకుమార్‌ను అధిష్టానం నియమించింది. ఎన్నికల్లో హంగ్‌ వచ్చిన.. తక్కువ మెజార్టీ వచ్చిన క్యాంపును ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. హంగ్‌ వస్తే డీకే శివకుమార్‌ కనుసన్నల్లోనే క్యాంపు ఆపరేషన్‌ జరగనుంది. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన.. తక్కువ మెజార్టీ వచ్చిన గెలిచిన అభ్యర్ధులను బెంగళూరు క్యాంప్‌కు తరలించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ఏర్పా్ట్లు చేస్తుంది.

మరో వైపు భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష‌్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌ ఇంటికి కాంగ్రెస్‌ నేతలు క్యూ కడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ సరళి, తక్కువ, ఎక్కువ పోలింగ్‌ జరిగిన నియోజకవర్గాలపై కాంగ్రెస్‌ నేతలు సుధీర్ఘంగా సమీక్షించారు.  

Tags:    

Similar News