కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌

Update: 2020-01-04 05:54 GMT
కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌

కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ వచ్చారు. రావడం రావడమే అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఎవరైనాసరే తమవైపు చూసేలా ఆకర్షిస్తున్నారు. అంతేకాదు, 24గంటలూ డ్యూటీ చేస్తున్న ఆ ట్రాఫిక్ కాప్స్‌ను చూసి వాహనదారులు జాగ్రత్తపడుతున్నారు. ఇంతకీ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ ప్రత్యేక ఏంటో మీరే చూడండి.

కరీంనగర్‌లో కొత్త ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌ వచ్చారు. రావడం రావడమే అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎవరైనాసరే తమవైపు చూసేలా ఆకర్షిస్తున్నారు. సాధారణంగా కూడళ్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే వాహనదారులు సిగ్నల్స్‌ను పాటిస్తారు. అదే, అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. అందుకే, ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితులోనైనా వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించేలా కరీంనగర్ పోలీసులు కొత్తగా ఆలోచించారు. చౌరస్తాల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ రూపంలో ఉండే బొమ్మలను ఏర్పాటు చేశారు. రియల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరిగా తయారు చేసిన ఈ బొమ్మలను కరీంనగర్‌లో పట్టణమంతటా పెట్టారు. దాంతో, నిజంగానే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడేమోననుకుని సిగ్నల్స్ క్రాస్ చేసేందుకు వాహనదారులు భయపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ మందుకెళ్తున్నారు.

మొత్తం 16 ట్రాఫిక్ కానిస్టేబుల్ బొమ్మలను తెప్పించిన కరీంనగర్ పోలీసులు 11 సర్కిళ్ల దగ్గర పెట్టారు. మిగతా ఐదు బొమ్మలను రూరల్ ప్రాంతాల్లో అమర్చారు. అయితే, చాలా దగ్గరికి వచ్చి చూస్తే తప్ప ఇది బొమ్మ అనే విషయం వాహనదారులకు తెలియదు. దాంతో, వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తున్నారు. అయితే, అవి బొమ్మలని తెలిశాక వాహనదారుల్లో భయం పోతుందని ఆలోచించిన పోలీసులు ఆయా ప్రాంతాలకు వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో, ఆయా సర్కిళ్లలో ఉన్నది నిజమైన ట్రాఫిక్ కానిస్టేబులో లేక బొమ్మో తెలియక వాహనదారుల్లో కొంత భయం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్నది బొమ్మే అనుకుని రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు సడన్ షాకిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ బొమ్మల ఫార్ములాను కరీంనగర్ పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో వినియోగిస్తున్నారని, అక్కడ ఇది విజయవంతమైందని, ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని కరీంనగర్ పోలీసులు భావిస్తున్నారు.


Full View


Tags:    

Similar News