Land Grabbing Case: కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు
Land Grabbing Case: మన్నేగూడలో 2ఎకరాల భూకబ్జా కేసు
Land Grabbing Case: కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు
Land Grabbing Case: భూకబ్జా కేసులో మాజీ సీంఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్‌రావు అరెస్ట్ అయ్యారు. ఆదిభట్ల పోలీసులు మంగళవారం కన్నారావును అరెస్టు చేశారు. మన్నేగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు యత్నించారన్నకేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కన్నారావుతో పాటు మరో 38మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 10మందిని అరెస్టు చేయగా... మరో 28మంది పరారీలో ఉన్నారు. కన్నారావు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేసింది. కన్నరావుకు రిమాండ్ విధించడంతో చర్లప్లలి జైలుకు తరలించారు.