Kale Yadaiah: బీజేపీపై విరుచుకుపడిన కాలె యాదయ్య

Kale Yadaiah: రెండో టేపులో వెల్లడయిన అంశంపై యాదయ్య స్పందన

Update: 2022-10-30 06:00 GMT

Kale Yadaiah: బీజేపీపై విరుచుకుపడిన కాలె యాదయ్య

Kale Yadaiah: చేవెళ్ల, వికారాబాద్, పరిగి, కొడంగల్ శాసనసభ్యులు కూడా బీజేపీలోకి చేరుతున్నారనే వార్తలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తీవ్రస్థాయిలో ఖండించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దర్యాప్తు సందర్భంగా విడుదల చేసిన రెండో టేపులో వెల్లడయిన అంశంపై ఆ‍యన క్యాంపు కార్యాలయం మీడియాతో మాట్లాడారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, దళితులను అవమానించిన పార్టీ అంటూ ఆ పార్టీ నాయకులపై... పార్టీపై విరుచుకుపడ్డారు.. చేవెళ్ల ప్రాంతంపై... బీజేపీ నాయకుల చేసిన విషప్రచారాన్ని ఎవరూ నమ్మబోరని, ఇలాంటివి పునరావృతమయితే సహించబోమన్నారాయన... 8 సంవత్సరాల బీజేపీ పాలనలో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇలాంటి బూటకపు.. విషప్రచారం చేస్తే బీజేపీ నేతలపై దాడులు చేయకతప్పదని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Tags:    

Similar News