Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపుపై కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
Kadiyam Srihari: ఓర్వలేని వాళ్లు కలలు కంటున్నట్టు ఉపఎన్నికలు రావు
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపుపై కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపుపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓర్వలేని వాళ్లు కలలు కంటున్నట్టు... ఉప ఎన్నికలు రావని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాఫీ అందలేదన్నారు కడియం. ఫిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు భిన్నమైన తీర్పులు ఇచ్చిందన్నారు.
కోర్టులంటే గౌరవం ఉందని,, పార్టీ నాయకులతో, న్యాయ నిపుణుల సలహాలతో సాధ్యసాధ్యాలని పరిశీలించి డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తానన్నారు కడియం శ్రీహరి. అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. గతంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే విమర్శించారు కడియం.