TS Highcourt: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సీఎస్ చంద్ర నియామకం

*రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించనున్న గవర్నర్ తమిళిసై *హాజరుకానున్న సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు

Update: 2021-10-11 06:09 GMT

తెలంగాణ హైకోర్టు (ఫోటో- ది హన్స్ ఇండియా)

TS Highcourt: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా సీఎస్ చంద్రను ఇటీవల రాష్ట్రపతి నియమించారు. జస్టిస్‌ సతీష్ చంద్ర తో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయం 11గంటలకు రాజ్‌భవన్‌లో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.

Tags:    

Similar News