Justice Alok Aradhe: తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం
Justice Alok Aradhe: ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్
Justice Alok Aradhe: తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం
Justice Alok Aradhe: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు.
ఈమేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయశాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964, ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు.