Jupally Krishna Rao: మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు
* నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్‌శాఖ దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది * నాగర్‌కర్నూల్ ఎస్పీ ఎందుకు పనికిరాని వ్యక్తి
జూపల్లి కృష్ణారావు (ఫోటో: ది హన్స్ ఇండియా)
Jupally Krishna Rao: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్‌శాఖపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా పోలీస్‌శాఖ అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని, జిల్లా ఎస్పీ ఎందుకు పనికిరాని వ్యక్తి అని అన్నారు. కోడేరు ఎస్సై దోపిడీదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని స్టేషన్‌కు పిలిపించి రోజంతా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలు నియోజకవర్గంలో తరుచూ జరుగుతున్నా ఎస్పీ మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జూపల్లి.