Jupally Krishna Rao: బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు, కాబట్టే.. ప్రజలు తిరగబడ్డారు
Jupally Krishna Rao: కేటీఆర్, హరీష్‌రావులు పోటీపడి సమావేశాలు పెడుతున్నారు
Jupally Krishna Rao: బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు, కాబట్టే.. ప్రజలు తిరగబడ్డారు
Jupally Krishna Rao: తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పి 2 నెలలు కూడా కాలేదని...అప్పుడే కేటీఆర్, హరీష్‌రావులు పోటీపడి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు తిరగబడ్డారన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని అన్నారు. తమ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిందని అంటున్నారని బీఆర్ఎస్ తమతో పోటీపడి మరి హామీలు ఇచ్చిందని మరి వాటిని ఎలా అమలు చేసేవారిని మంత్రి జూపల్లి ప్రశ్నించారు.