Jupally Krishna Rao: కేసీఆర్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు
Jupally Krishna Rao: అమ్ముడుపోయిన కొనుగోలు చేసిన నాయకులను.. గ్రామాలకు రానీయకుండా అడ్డుకోవాలి
Jupally Krishna Rao: కేసీఆర్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడు
Jupally Krishna Rao: సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజల వ్యతిరేకతను తట్టుకోలేకనే కేసీఆర్ నాయకులను కొనుగోలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బుతో నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమ్ముడుపోయిన కొనుగోలు చేసిన నాయకులను గ్రామాలకు రానీయకుండా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అధికార పార్టీ నుంచి బయటకు వచ్చాడంటే ప్రజల కోసం కొట్లాడే వాడని ఆయన అన్నారు.