KTR: ఓటమితో కుంగిపోం, ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడతాం

Update: 2025-11-14 11:01 GMT

జూబ్లీహిల్స్‌‌ ఉపఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓటమితో కుంగిపోమని..ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. పోలింగ్‌ ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు.

జూబ్లీహిల్స్‎లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని తెలిసిపోయిందన్నార కేటీఆర్. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడ్డాయని...తెలంగాణలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News