జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన: స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు
జూబ్లీహిల్స్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన: స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code of Conduct)ని ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన పలువురు ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలను (MLCs) గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కొందరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అనధికారికంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఉండి నిబంధనలను అతిక్రమించారని ఆయన పేర్కొన్నారు.