JP Nadda: తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పర్యటన రద్దు

JP Nadda: సంగారెడ్డి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే విధంగా షెడ్యూలు

Update: 2023-03-31 02:13 GMT

JP Nadda: తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పర్యటన రద్దు

JP Nadda: తెలంగాణలో బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా పర్యటన రద్దైంది. సంగారెడ్డి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ శ్రేణులతో భేటీ అయ్యే విధంగా షెడ్యూలు ఖరారైంది. ఢిల్లీలో కురిసిన వర్షాలతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో జెపి నడ్డా హైదరాబాద్ చేరుకోలేక పోయారు. జెపి నడ్డా పర్యటన రద్దు కావడం ఇది రెండోసారి. జెపీ నడ్డా కార్యక్రమం ఉంటుందని తెలంగాణలోని వివిధ జిల్లాల నాయకులు జనసమీకరణకు సమాయాత్తమయ్యారు. నడ్డా పర్యటన రద్దు కావడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.

Tags:    

Similar News